Monday, December 23, 2024

పక్కింటి వ్యక్తి తిట్టాడని… కూతురును కాలుతున్న గడ్డివాములోకి విసిరేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: పక్కింటి వ్యక్తి గొడవకు దిగాడని మద్యం ప్రియుడు తన కూతురును కాలుతున్న గడ్డివాములో విసిరేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బరంగెడ్గి గ్రామంలో సాయిలుకు అంకిత(7), మహిత(5) అనే కూతుళ్లు ఉన్నారు. ఆదివారం ఇద్దరు ఆడుకుంటున్నారు. అదే సమయంలో కొద్ది దూరంలో ఉన్న గంగాధర్ అనే వ్యక్తికి చెందిన గడ్డి కుప్పలకు నిప్పు అంటుకున్నాయి. 70 శాతం గడ్డి దగ్ధం కావడంతో ఆర్పివేయడానికి వీలులేకుండా పోయింది. సాయిలు కుమార్తె అంకిత తన గడ్డి వాముకు నిప్పు అంటించిందని అతడిని గంగధర్ తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కూతురును గడ్డి వాములోకి విసిరేశాడు. గంగాధర్ అప్రమత్తమై వెంటనే బాలికను బయటకు తీసుకొచ్చాడు. వెంటనే ఆమె స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాలి, రెండు చేతులకు గాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అంకిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News