Thursday, December 19, 2024

అంబులెన్స్ లో లేచి కూర్చున్న ‘మృతదేహం’

- Advertisement -
- Advertisement -

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు పరీక్షించి చనిపోయింది, ఇంటికి తీసుకెళ్లిపొమ్మని చెప్పారు. బంధువులంతా రోదిస్తూ ఆమె మృతదేహాన్ని అంబులెన్సులోకి ఎక్కించి, బయల్దేరారు. తీరా మార్గమధ్యంలో ఆ మహిళ అంబులెన్సులో లేచి కూర్చుంది. కాసిని మంచినీళ్లిమ్మని అడుగుతున్న ఆమెను చూసి, బంధువులకు నోటమాట రాలేదు. ఉత్తరప్రదేశ్ లోని రాఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదర్ గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.

సదర్ గ్రామానికి చెందిన అనిత (33) బ్లడ్ కాన్సర్ తో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స జరుగుతుండగా తన భార్య చనిపోయిందని డాక్టర్లు చెప్పారని అనిత భర్త మతాదిన్ రక్వార్ చెప్పాడు. దాంతో మృతదేహాన్ని తమ స్వగ్రామానికి అంబులెన్సులో తరలిస్తుండగా ఆమె లేచి కూర్చుందని చెప్పాడు. ప్రస్తుతానికి అనిత ఆరోగ్యం బాగానే ఉందని అతను చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News