Friday, January 10, 2025

4న ఆటోడ్రైవర్ల మహాధర్నా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డిసెంబర్ 9నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. గతంలో ఆటోలు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించిన మహిళలందరూ బస్సులు ఎక్కడం ప్రారంభించారు. దాంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆటోలకు  గిరాకీ తగ్గింది. దాంతో ప్రభుత్వ నిర్ణయం తమ పొట్టకొడుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం ఆటోడ్రైవర్లు ఈనెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News