Sunday, November 24, 2024

పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు: రేవంత్

- Advertisement -
- Advertisement -

పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని రాష్ట్ర సచివాలయంలో మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని తెలిపారు. మంత్రులకు ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 3వ తేదీన పిసిసి విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నాకు దగ్గరి బంధువుకో పదవులు ఇచ్చేది ఉండదు. తాను ఏదీ చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేస్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News