Monday, December 23, 2024

ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ లోని జలంధర్ జిల్లా అదంపూర్‌లోని గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. 59 ఏళ్ల మన్మోహన్‌సింగ్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతుండగా, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల మనుమరాలి మృతదేహాలు అదే గది లోని బెడ్‌పై ఉన్నాయని పోలీస్‌లు చెప్పారు. మన్మోహన్ సింగ్ రాసిన సూసైడ్ నోట్ ఆ గదిలో లభించింది.

ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు మన్మోహన్‌సింగ్ ఆ నోట్ లో రాసి ఉంది. మొదట తన కుటుంబ సభ్యలను చంపి తరువాత ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పెద్ద కుమార్తె తన కుమార్తెతో కలిసి తరచుగా పుట్టింటికి వస్తుంటుందని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె భర్త ఆదివారం ఫోన్ చేయగా ఎవరూ స్పందించక పోవడంతో అతడితో కలిసి ఆ ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. పెళ్లైన కుమారుడు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడని వివరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News