Tuesday, November 5, 2024

కశ్మీర్‌లో తొలిసారి కొత్త సంవత్సర వేడుకలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లాల్‌చౌక్ ఏరియాలో గత ఐదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీనగర్ ఘంటా ఘర్ (క్లాక్‌టవర్ ప్రాంతం)లో పర్యాటక శాఖ నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందలాది మంది స్థానికులు, పర్యాటకులు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

గతంలో చాలాసార్లు తాము ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంతకుముందెన్నడూ లాల్‌చౌక్‌లో ఈ విధంగా సంబరాలను చూడలేదని మహమ్మద్‌యాసిన్ అనే స్థానికుడు తెలిపారు. మ్యూజికల్ ఈవెంట్ ధూంధాంగా ఉందని మరో స్థానికుడు ఆనందం వ్యక్తం చేశాడు. శ్రీనగర్ స్కేర్ (లాల్‌చౌక్) ఇంతవరకు సిటీలైఫ్ చూడలేదని, ఇంతడి ఆనందోత్సవాలు ఎన్నడూ లేదని శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ , శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ సీఈఓ అథర్ అమర్ ఖాన్ అభివర్ణించారు. శ్రీనగర్ సిటీ తొలిసారి శ్రీనగర్ స్మార్ట్ సిటీ (ఎస్‌ఎంఎస్) గా రూపాంతరం చెందుతోందనడానికి ఇదే ప్రత్యక్ష సాక్షమని అన్నారు. కొత్త సంవత్సరం వేళ ఎస్‌ఎంఎస్ టీమ్ దీనిని సాధ్యం చేసిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News