అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే శ్రీరామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. శ్రీరాముడి భక్తులకే ఆహ్వానం పంపామని ఆయన చెప్పారు. ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇందరూవ్యూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. శ్రీరాముడి పేరుతో బిజెపి యుద్ధం చేస్తోందనడం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు.
మన ప్రధాని నరేంద్ర మోడీని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, ఆయన ప్రధానిగా తన పదవీకాలంలో ఎంతో కృషి చేశారని సత్యేంద్ర దాస్ చెప్పారు. ఇవి రాజకీయాలుకాదని, ఇది అంకితభావమని ఆయన అన్నారు. గత శనివారం విలేకరులతో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అయితే అయోధ్యకు వెళ్లడానికి తనకు ఎవరి ఆహ్వానం అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఆలయంలో జరిగే కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని, రాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకో సొంతం కాదని కూడా ఆయన చెప్పారు. కాగా ఈ ఉత్సవం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆరే వేల మందికి పైగా ఆహ్వానాలు పంపింది. జనవరి 16న మొదలై ఏడు రోజుల పాటు రామాలయంలో ఉత్సవాలు జరుగుతాయ.ఇ