Monday, December 23, 2024

మూడోసారి కేంద్రంలో అధికారం చేపడుతాం

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం ఈనెల 22న జరుగుతున్నట్లు, 2024 కీలకమైన సంవత్సరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. టిటిడి అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

వైకుంఠ ద్వారా దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరోసారి కేంద్రంలో బిజెపి అధికార చేపడుతుందని, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ బలమేంతో బయటపడిందన్నారు. ప్రధాని మోడీ గత 10 ఏళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి అధికారం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భారత్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News