Monday, December 23, 2024

జపాన్ లో వరుసగా 21 భూకంపాలు!

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ 21 వరుస భూకంపాలతో కంపించిపోయింది. రిక్టరు స్కేలుపై 4.0 కంటే అధిక తీవ్రత నమోదయింది. ఇషికావా ద్వీపకల్పంలోని వాజిమా పోర్డు వద్ద సునామీ అలలు సుమారుగా 1.2 మీటర్ల ఎత్తువి గుర్తించారు. 36000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తాజా భూకంపం 1983లో వచ్చిన భూకంపాన్ని పోలి ఉంది.

జపాన్ నాలుగు ఖండాల ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంటాయి. పసిఫిక్, ఫిలిప్పియన్స్, యూరేసియన్స్, ఉత్తర అమెరికా భూఫలకాల కదలికలతో దీనికి సంబంధం ఉంటుంది. భూకంపాల నేపథ్యంలో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News