ఇంటర్‌నెట్‌లో వీడియోలు వైరల్
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాదిగా ముద్రపడిన మసూద్ అజర్ పాకిస్తాన్‌లో జరిగిన బాంబు పేలుడులో మరణించాడా? అవుననే అంటున్నాయి సోసల్ మీడియా వేదికలు. గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలుడులో మసూద్ అజర్ మరణించాడంటూ సోషల్ మీడియా సోమవారం హోరెత్తిపోయింది. మసూద్ మరణానికి సంబంధించిన వీగియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ వంటి వాటిలో వైరల్ కాగా ఈ పరిణామంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కాంహార్ విమానం హైజాకర్, మసూద్ అజర్ తెల్లవారుజామున 5 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించిన బాంబు పేలుడులో మరనించాడని అనధికారిక వార్తలు పేర్కొన్నాయని ఒక యూజర్ రాశాడు.
డర వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం తర్వాత ఈ కొత్త సంవత్సరంలో గుర్తు తెలియని వ్యక్తులు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజర్‌ను బాంబు పేలుడులో హతమార్చారని మరో యూజర్ తెలిపాడు. గుర్తు తెలియని ధన్యవాదాలంటూ ఆ యూజర్ వ్యాఖ్యానించాడు. 2023 నవంబర్‌లో మసూద్ అజర్ కుడి భుజం మౌలానా రహీముల్లా తారీఖ్‌ను పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. పాకిస్తాన్‌లో ఇటీవలి కాలంలో పలువురు ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ హత్యలకు పాల్పడిన వారిని పట్టుకోవడంలో విఫలమైన పాకిస్తాన్ ఈ హత్యల వెనుక భారతీయ గూఢచారి సంస్థ రా ఉండవచ్చని నమ్ముతోంది.