Monday, December 23, 2024

గవర్నర్‌కు అయోధ్య అక్షింతలు అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌ను సోమవారం కలిసి వారు అక్షింతలు అందజేశారు. జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్షింతలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు.

అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సాకారమవుతోందని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను సైతం రామమందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా స్పందిచిన గవర్నర్ తమిళి సై దర్శనానికి తప్పకుండా వస్తానని చెప్పిందని వారు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News