హైదరాబాద్‌కా నిషాన్….నుమాయిష్
మన తెలంగాణ / హైదరాబాద్: ”హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రతి సంవత్సరం నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అనంతరం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థల యాజమాన్యాలు నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయని చెప్పారు. 30వేల మంది విద్యార్థులు ఎగ్జబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారన్నారు. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపార వేత్తలను తయారు చేశారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పేరుకుపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎగ్జిబిషన్ సోసైటీ సభ్యులు పాల్గొన్నారు.
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనున్నది. 83 వ అల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర 40 రూపాయలుగా చేశారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 వరకు నుమాయిష్ కొనసాగుతుంది. వీక్ ఎండ్ లో రాత్రి 11 వరకు నుమాయిష్ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సుదుపాయం కల్పించారు. జనవరి 9వ తేదీ ఉమెన్స్ డే సందర్భంగా ఆ రోజు మహిళకు మాత్రమే అనుమతిని కల్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడవనున్నాయి. నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలీస్, అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించనున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2024ను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారు.
— హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు.Chief Minister Mr. Revanth Reddy inaugurated Numaish-2024 at Nampally Exhibition Grounds,… pic.twitter.com/koqB2lQ1ja
— Congress for Telangana (@Congress4TS) January 1, 2024