- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన సంవత్సరం 2024ను పురస్కరించుకుని పలువురు టిడిపి నేతలు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుని పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన రావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏలు బక్కని నర్సింహులు, కాట్రగడ్డ ప్రసూన, టిడిపి మీడియా కమిటీ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి, తెలుగు యువత మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జునతో పాటు ఎన్‌టిఆర్ ట్రస్ట్ సిబ్బంది చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ‘ మల్కాజ్‌గిరి పార్లమెంట్ తెలుగు యువత క్యాలెండర్ 2024’ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
- Advertisement -