మనతెలంగాణ/హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. డిసెంబర్ నెలలో రాష్ట్రంలోలిక్కర్ విక్రయాలు జోరుగా జరిగాయి.2022 డిసెంబర్ నెల రికార్డును 2023 డి సెంబర్ నెల తిరగరాసింది. ఏకంగా అమ్మకాలు 26 శాతం పెరిగాయి. ఇందులో 33 శాతం మద్యం అమ్మకాలు పెరగ్గా. బీర్లు విక్రయాలు 16 శాతం పెరిగాయి. ఇక మద్యం అమ్మకాలతో 2023 డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 274 కోట్ల రూపాయల మద్యం వి క్ర యాలు జరగడం విశేషం. ఈ డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆ కాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.620 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి. ముందే ఈవెంట్‌లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్‌లు, పబ్బుల్లోనూ లిక్కర్‌ను భారీగా డంప్ చేశారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వడం, రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా ఆదాయం మరింత పెరిగింది. ఈ మూడు రోజుల్లో 5.77 లక్షల లిక్కర్ కేసులు, 6.13 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 31వ తేదీ ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్షా30 వేల కేసుల లిక్కర్, లక్షా 35 వేల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. 31వ తేదీన ప్రభుత్వానికి రూ.127 కోట్ల ఆదాయం సమకూరింది.
ఆదివారం 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయం
మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడు పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం,కూల్ డ్రింక్స్ తో పాటు చికెన్,మటన్,చేపలు కూడా భారీగా అమ్ముడుపోయాయి.హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సందర్భంగా నాన్ వెజ్ విక్రయాలు సైతం భారీగా పెరిగాయి. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో నాన్ వెజ్ విక్రయాలు మరింత పెరిగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగితే ఆదివారం ఒక్క రోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగడం విశేషం.