Friday, December 20, 2024

సైబర్ మోసగాళ్లకు చిక్కిన బాలీవుడ్ నటుడు!

- Advertisement -
- Advertisement -

ఎంతటి తెలివైనవాళ్లనైనా బురిడీ కొట్టించగల చాకచక్యం సైబర్ మోసగాళ్ల సొంతం. మాటలతో బోల్తా కొట్టించి, నమ్మకద్రోహానికి పాల్పడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ బాలీవుడ్ నటుడికి టోపీ వేసి, 85వేల రూపాయలు లాగేశారు!

బాలీవుడ్ లో రాకేశ్ బేడీ గురించి తెలియనివారు ఉండరు. కమేడియన్ గా తెరపై నవ్వులు పండించే ఈ నటుడు తాజాగా గదర్ 2 సినిమాలో కూడా నటించాడు. ఇటీవల రాకేశ్ బేడీకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, తన పేరు ఆదిత్య కుమార్ అనీ, తాను ఒక ఆర్మీ ఆఫీసర్ ననీ పరిచయం చేసుకున్నాడు. పుణెలో ఉన్న తన ఫ్లాట్ ను ఒక హౌసింగ్ పోర్టల్ లో అమ్మకానికి పెట్టానని చెబుతూ ఆసక్తి ఉంటే తక్కువ ధరకే అమ్ముతానని రాకేశ్ బేడీకి ఆశపెట్టాడు. ఆర్మీ అధికారినని చెప్పుకోవడంతో నమ్మిన రాకేశ్ మొదట 50 వేలు, ఆ తర్వాత 25 వేలు, 10 వేలు సమర్పించుకున్నాడు. తన అకౌంట్లో డబ్బు జమ అయ్యాక, అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్ చేయడంతో రాకేశ్ బేడీ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను గతంలో ఒక ఆర్మీ అధికారికే తన ఆస్తి ఒకటి అమ్మాననీ, అందువల్ల ఆర్మీ అధికారినని ఆ మోసగాడు చెప్పడంతో నమ్మేశాననీ రాకేశ్ చెప్పారు.

రాకేశ్ కు కేరీర్ ఆరంభంలో టెలివిజన్ సీరియళ్లు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. యే జో హై జిందగీ, శ్రీమాన్ శ్రీమతి, భాభీజీ ఘర్ పర్ హై వంటి సీరియళ్లలో నటించిన రాకేశ్ బేడీ, ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఏక్ జాన్ హై హమ్, మేరా దామాద్, చష్మే బద్దూర్ వంటి సినిమాల్లో నటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News