- Advertisement -
విమానాశ్రయం రన్ వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈఘటన జపాన్ లో చోటుచేసుకుది. టోక్యోలోని హనేడా ఎయిర్ పోర్టు రన్ వేపై లాండింగ్ సమయంలో.. కోస్ట్ గార్డ్ విమానాన్ని జపాన్ ఎయిర్ లైన్స్ విమానం ఢీకొట్టింది. దీంతో జపాన్ విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పారు.
ప్రమాద సమయంలో విమానంలో 367మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
- Advertisement -