Saturday, December 21, 2024

విద్యుత్ ఇంజనీర్లు కష్టపడి పనిచేయండి: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలలో ఇంజనీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదని, మీరు కష్ట పడి పని చేసి వినియోగ దారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని, సంస్థ నష్టాలు తగ్గించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడంలో విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఇంజనీర్లందరము నిరంతరంగా శ్రమిస్తామని, అన్ని రకాలుగా ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు సిఎం తెలిపారు.

విద్యుత్ సంస్థలలో డైరెక్టర్ల నియామకం త్వరగా చెప్పట్టాలని, విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. సిఎంను కలిసిన వారిలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి.రత్నాకర్ రావు, పి.సదానందం, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ కంపెనీ కార్యదర్శి జనప్రియ,టెక్నికల్ సెక్రటరీ గోపాలకృష్ణ, విద్యుత్ సౌధ సెక్రటరీ మల్లయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News