Saturday, December 21, 2024

చంపుతారనే భయంతోనే వెళ్ళిపోయా:బైరి నరేష్

- Advertisement -
- Advertisement -

మంగపేట: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో జరిగిన సంఘటనపై హేతువాది బైరి నరేష్ మంగళవారం తన స్వగృహం ఉప్పల్ కమలాపురం నుంచి ఓ వీడియోలో వివరణ ఇచ్చారు. తాను జనవరి ఒకటవ తేదీన ఏటూరు నాగారంలోని బిఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో భీంరావు కోరేగావ్ సమావేశాన్ని నిర్వహించాలని పలువురుకి విషయాలను తెలియజేయాలని ప్రజా చైతన్య సమావేశాన్ని నిర్వహించాలని మా మిత్రులు నన్ను ఏటూరునాగారం రావాలని కోరారని తెలిపారు. ఈ విషయంపై కేవలం ప్రజా సంఘాల నాయకులు, మిత్రులు కేవలం పది నుంచి పదిహేను మంది మాత్రం హాజరు కావాలని కోరినట్టు తెలిపారు. ఈవిషయంపై స్థానిక పోలీసుల వద్ద అనుమతిని తీసుకున్నామని తెలిపారు. అయితే సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులు వచ్చి మీరు గతంలో అయ్యప్పస్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మీరు అన్న మాటలను వెనకకు తీసుకోవాలని కోరినట్టు వివరించారు.

దీంతో తాను అందరికి గతంలోనే క్షమాపణలు చెప్పానని ఎవరికైనా ఇబ్బందులు కలిగించినట్టు అయితే క్షమించమని కోరానని వివరించారు. అయితే అప్పటికి చాలా మంది అయ్యప్ప మాలధారణ చేసిన వ్యక్తులతో పాటుగా ఇతరులు కూడా వచ్చి నన్ను నానా దుర్భాషలు ఆడి అక్కడి నుంచి వెళ్ళి పోవాలని డిమాండ్ చేశారని అన్నారు. దీంతో నేను నా భార్యా పిల్లలను తీసుకుని కారులో వెళ్ళానని అయ్యప్ప స్వాములను కారుతో గుద్దేందుకు ప్రయత్నించానని తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారును స్పీడుగా వరంగల్ వైపు వెళ్లి మళ్ళీ వెంబడించి దాడి చేస్తారేమో అనే భయంతో మణుగూరు వైపు కారును తీప్పుకుని వెళుతున్న క్రమంలో రోడ్డు సరిగా లేకపోవడంతో గుంతలుగా ఉన్న రోడ్డులో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిందని కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడనని అన్నారు. అప్పటికి నా వెనుక నాలుగు అయిదు ద్విచక్ర వాహనాలతో వెంబడించారని అన్నారు.

అక్కడి నుండి వేరే ఆటోలో మణుగూరుకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి హన్మకొండ జిల్లా ఉప్పల్ కమలాపురం చేరుకున్నానని అన్నారు. అక్కడ సమావేశం సమయంలో నా ఫోన్ మా మిత్రుడికి ఇచ్చానని ఫోన్ నా దగ్గర లేదని వివరించారు. నేను రాజకీయాలు చేయడానికి గాని దేవుళ్ళమీద ఆరోపణలు చేసేందుకు రాలేదని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించేందుకు వచ్చానని అన్నారు. పోలీసులు , చట్టం, ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News