Tuesday, December 17, 2024

కోదండరాంను కలిసిన జహీరాబాద్ చెరుకు రైతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు మంగళవారం తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయానికి వచ్చి టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. చక్కర పరిశ్రమ ప్రారంభించాలని గత నెల 28న జహీరాబాద్ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు.

ప్రజాభవన్‌లో చెరుకు సమస్యల పరిష్కారం కోసం విన్నవించడానికి వచ్చినట్లు తెలిపారు. చక్కెర పరిశ్రమ గురించి రైతుల కష్టాల గురించి గత ప్రభుత్వం చెరుకు రైతులకు చేసిన మోసాల గురించి వారు కోదండరాంకు వివరించారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి పాదయాత్రగా వచ్చిన చెరుకు రైతులకు కోదండరాం సన్మానించారు. వారి పోరాటానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ రైతులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల కష్టాలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప రాష్ట్ర నాయకులు రాజ మల్లన్న, శ్రీనివాసరెడ్డి, ముజాహిద్దీన్ ,రావుల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News