Thursday, November 14, 2024

పెట్రో పిడుగు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం కొత్తగా తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్లు నిన్నటి నుండి ఆకస్మిక సమ్మెకు దిగారు. ఆయిల్ కంపెనీల వద్ద ఎక్కడి ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి.ఈ కారణంగా తెలుగు రా ష్ట్రాల్లో పె ట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. తె లంగాణలో నూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె కు దిగడంతో రాష్ట్రంలో వాహనదారులకు చు క్కలు కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఉరుకులు ప రుగులు తీశారు. సోమవారం సాయంత్రం నుంచే డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారు. దీంతో మంగళ వారం ఉదయం నుం చి పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది.

మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెట్రోల్ బంకుల దారిపట్టాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల కు వాహనదారులు పోటెత్తారు. మధ్యాహ్నం నుంచే పెట్రోల్ బంకుల మందు వాహనాలు బారులు తీరడంతో ట్రాపిక్ కు తీవ్ర అంతరా యం కలిగింది. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బంకులను యాజమాన్యాలు మూసివేశాయి. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందోనని పెట్రోలు స్టాక్ చేసుకుండామని చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. నగరంలో చాలా చోట్ల ట్రా ఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రజలు నగరంలోనే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చే సమయం  కావడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఒక్కో పెట్రోల్ బంకుకు ఒకే ట్యాంకర్ రావడంతో పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన వాహనదారుల్లో కనిపించింది. బంకుల్లో ఆన్‌లైన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పేమెంట్ ను బంకు యజమానులు అనుమతించలేదు. క్యాష్ ఉంటేనే పెట్రోల్ అని స్ఫష్టం చేయడంతో చాలా మంది క్యాష్ కోసం ఇబ్బంది పడ్డారు. బంకుల వద్ద పోలీసు బందోబస్తు కనిపించింది. నగర శివారుల్లో పెట్రోబంకుల్లో బారులు తీరిన వాహనాలు కనినిపించాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, ఉప్పర్‌పల్లిలోని బంకుల్లో రద్దీ భారీగా పెరిగింది. కాగా మంగళవారం సాయంత్రానికి ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ ట్యాంకర్లు లోడింగ్‌తో బ యలు దేరాయి. పెట్రోల్,డీజిల్ సరఫరా యధావిగా జరిగే అవకాశం ఉంది. వాహనదారులకు ఈ వార్త ఉపశమనం కలిగించింది.
చట్ట సవరణ బిల్లును పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యాచరణ
కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు తో డ్రైవర్లు నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ట్యాంకర్స్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గంధరగోళం ఏర్పడిందని, కేంద్రం తెచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. వాహనదారులను డ్రైవర్స్ అసోసియేషన్ ఇబ్బంది పెట్టదని అన్నారు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుంటామన్నారు.
ఆందోళన వద్దు… వెంటనే విధుల్లో చేరండి : కమిషనర్
ఆయిల్ టాంకర్ల డ్రైవర్ల సమ్మె పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్ లో బిపిసిఎల్, ఐఒసిఎల్, హెచ్ పిసిఎల్ ఆయిల్ కంపెనీల అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ డిఎస్ చౌహాన్ అయిల్ కంపెనీల అధికారులను ఆదేశించారు. సమ్మె చేస్తున్న డ్రైవర్ల సమస్యలపై సానుభూతితో చర్చలు జరపాలన్నారు, ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు ఇద్దరికీ తాము పూర్తి సహకారం అందిస్తామని, తక్షణమే విధుల్లో చేరి పెట్రోల్, డీజిల్ రవాణా చేయాలని సూచించారు.

డ్రైవర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిషనర్ డిఎస్ చౌహాన్ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు సాయంత్రానికల్లా ఆపరేషన్ అమల్లోకి రావడంతో కార్యకలాపాలు పునప్రారంభం అయ్యేలా చ ర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, భయాందోళనలకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News