- Advertisement -
హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు.
గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు వెళ్తుండగా బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింతా పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -