Monday, December 23, 2024

వైద్యం వికటించి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటనా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ గౌడ్, భార్య వైష్ణవి దంపతులు కొండమడుగు గ్రామం బిబి నగర్ లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.వెంకటేష్ కొండమడుగులో ఓ ప్రవేటు స్కూల్లో పనిచేసున్నాడు. కాగా డిసెంబర్ 30న వెంకటేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో బంధువులు పీర్జాదిగూడలోని శ్రీకార ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకొచ్చారు.

అడ్మిట్ చేసుకున్న వైద్యులు వెంకటేష్ కి ఆపరేషన్ చేశారు. కోమాలో ఉన్న వెంకటేశ్ మంగళవారం బంధువులతో మాట్లాడాడు. అయితే మంగళవారం రాత్రి వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు బంధువులకు తెలిపారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News