- Advertisement -
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో బారత బౌలర్లు చెలరేగుతున్నారు. టీమిండియా బౌలర్ల ధాటికి సఫారీ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. బుధవారం కేప్ టౌన్ లో ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్లకు భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు చుక్కలు చూపెడుతున్నారు. దీంతో 29 పరుగులకే సఫారి జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 29 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కైల్ వెర్రెయిన్(04), డేవిడ్ బెడింగ్‌హామ్(10)లు ఉన్నారు. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలతో బరిలోకి దిగింది.
- Advertisement -