Friday, December 20, 2024

సైబర్ నేరగాళ్ల నుంచి రూ.1100 కోట్లు కాపాడిన పోలీస్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాదిలో సైబర్ నేరగాళ్ల నుంచి 1100 కోట్లను పోలీస్‌లు కాపాడగలిగారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరినిమిషంలో సైబర్ క్రైమ్ పోలీస్‌లు అడ్డుకోగలిగారు. ఒక లక్షజనాభాకు గాను గత ఏడాది అత్యధికంగా హర్యానాలో 381సైబర్ క్రైమ్ నేరాలు నమోదయ్యాయి.

తెలంగాణలో 261, ఉత్తరాఖండ్‌లో 243, గుజరాత్‌లో 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, ఛండీగఢ్‌లో 432 కేసులు, నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లకు చెందిన 295461 సిమ్ కార్డులను, 2810 వెబ్‌సైట్‌లు, 585 మొబైల్ యాప్‌లు, 46,229 ఐఎంఈఇలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News