- Advertisement -
తాము బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజెందర్ వంటి బిజెపి అగ్రనేతలను ఓడించిందని బిఆర్‌ఎస్సే అని కెటిఆర్ తెలిపారు. కామారెడ్డిలో తమ అధినేత కెసిఆర్‌ను ఓడించింది బిజెపినే అని పేర్కొన్నారు. తాము బిజెపికి బీ టీం కాదనడానికి ఇంతకంటే ఏం కావాలని, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, ముఖ్యంగా మైనార్టీ సోదరులు నమ్మవద్దని కెటిఆర్ కోరారు.బిజెపి మత విద్వేషం తప్ప ఏమీ చేయదని, బిజెపితో పోరాడాలంటే కెసిఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని కెటిఆర్ అన్నారు.
- Advertisement -