Monday, December 23, 2024

నేడు అద్దె బస్సుల యాజామాన్యలతో ఆర్‌టిసి చర్చలు

- Advertisement -
- Advertisement -

నేడు అద్దె బస్సుల యాజామాన్యలతో
ఆర్‌టిసి చర్చలు
చర్చల ఆధారంగా తదుపరి కార్యాచరణ
అద్దె బస్సులు యాజమాన్యాలు
మన తెలంగాణ / హైదరాబాద్: సమస్యలను పరిష్కరించక పోతే రేపటి నుంచి సమ్మె చేస్తామని అద్దెబస్సు యాజమాన్యాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌టిసి యాజమాన్యం దిగివచ్చి వారితో చర్చలకు సిద్దమైంది. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల సమయం మధ్యలో యాజమాన్యం బస్ భవన్‌లోచర్చలకు ఆహ్వానించినట్లు అద్దె బస్సులు నిర్వహకులు తెలిపారు. ఆర్‌టిసి యాజమాన్యం వైఖరికి నిరసనగా వారు నిర్వహించి అద్దె బస్సు టెండర్లలో కూడా తాము పొల్గొనలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ చర్చల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు పరిమితికి మించి ప్రయాణించడంతో మైలేజ్ తగ్గుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. అద్దె బస్సుల కెఎంపిఎల్( కిలో మీటర్ పర్ లీటర్)ను ఎక్స్‌ప్రెస్ బస్‌కు 4.5 గాను, పల్లె వెలుగు బస్సుకు 4.8 గాను సిటి బస్సులకు 4 కిలో మీటర్లుగా మార్చలనే డిమాండ్‌తో పాటు, ప్రతి నెలా అగ్రిమెంట్ ప్రకారం 10వ తేదీన బిల్లులు ఇప్పించాలని, మా బస్సులకు ఇన్సూరెన్స్ సీటింగ్ సామర్ధాన్ని బట్టి ఉంటుందని, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బస్సులో ఉన్న ప్రయాణికులకు అందరికి వర్తించే విధంగా పాలసి మార్చాలనే డిమాండ్ చేస్తామంటున్నారు.

ఓవర్ లోడ్ కారణంగా బస్సుల మెయింటెనెన్స్ పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న అద్దెకు రూ.2 తగ్గకుండా పెంచాలని తదిర డిమాండ్లను ఈ చర్చల్లో యాజమాన్యం ముందు ఉంచనున్నట్లు తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్ట తదుపరి కార్యచరణ ఉంటుందని అద్దెబస్సుల నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2700 అద్దె బస్సులు ఉండగా వాటిలో 1000 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 700 పల్లె వెలుగు బస్సులు,మరో 1000 బస్సులు సిటిలో ప్రయాణికులకు సేవల అందిసున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News