మేషం -ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి.
వృషభం -సంఘంలో గౌరవం పొందుతారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు అనుకూలం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూ యోగాలు.
మిథునం -కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం గోచరిస్తున్నది.
కర్కాటకం -బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వస్తు లాభం.
సింహం -భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
కన్య -సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు.
తుల -వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.
వృశ్చికం -వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి లాభం..
ధనున్సు -ఉద్యోగాలలో స్థానమార్పులు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. శుభవార్త.
మకరం -నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు.
కుంభం -ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.
మీనం -ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు.