- Advertisement -
హైదరాబాద్: జాన్సన్ గ్రామర్ హైస్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన హైదరాబాద్‌లోని హబ్సిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గురువారం ఉదయం తన తండ్రితో కలిసి సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చింది. కొంచెం దూరంలో ఉన్న తండ్రి వద్దకు బాలిక వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో బస్సు కింద పడింది. బస్సు టైర్ల కిందపడి పాప నుజ్జు నుజ్జు కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయింది. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -