Friday, December 20, 2024

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఖాళీ ఏర్పడడంతో.. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

జనవరం 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజునుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలు దాఖలు చేసుకునేందుకు జనవరి 18వరకు గడువు విధించారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వరకు గడువు ఇచ్చారు. జనవరి 29న పోలింగ్ జరనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News