న్యూఢిల్లీ: తన లక్షద్వీప్ పర్యటన సందర్భంగా తాను చేసిన సాహస కృత్యాలను, సముద్ర తీరంలో గడిపిన ఉల్లాసభరిత క్షణాలను ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో పంచుకున్నారు. సముద్రగర్భంలో ఈతకొట్టినస్రార్కలింగ్) అనుభవం, బీచ్‌లో సాగించిన ఉదయం నడక, ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదంచిన దృశ్యాలకు సబంధించిన ఫోటోలను గురువారం ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా ఎలా కష్టపడాలనే విషయమై ఆలోచించే అవకాశాన్ని లక్షద్వీప్‌లోని ప్రశాంత వాతావరణం తనకు కల్పించిందని మోడీ పర్యటన అనంతరం ఢిల్లీ తిరిగివచ్చిన మోడీ తెలిపారు. తన పర్యటనలో తాను చేపట్టిన వివిధ కార్యకలాపాలను ఆయన వివరించారు. తన పర్యటనలో తాను స్నార్కలింగ్(సముద్ర గర్భంలో ఈత) కూడా ప్రయత్నించానని , ఇదో అద్భుతమైన అనుభవమని ఆయన తెలిపారు.
సాహసాన్ని శ్వాసగా చేసుకునేవారికి లక్షద్వీప్ పేరు తమ టూరిస్టు స్పాట్‌లో తప్పనరిగా ఉండాల్సిందేనని మోడీ సూచించారు. సముద్రగర్భం కింద ఉండే రాళ్లు, ఇసుక దిబ్బలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. సూర్యోదయాన అందమైన బీచ్‌లో తాను సాగించిన నడకను, అప్పుడు లభించిన ప్రశాంతతను కూడా ఆయన వివరించారు. అగట్టి, బంగారం, కవరట్టి దీపాల వాసులను కూడా కలుసుకున్నానని తెలియచేస్తూ వారి ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన లోద్వీప్ పర్యటన ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని, నేర్చుకునే అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. లక్షద్వీప్ అనేది కేవలం క్నొ ద్వీపాల సమూహం మాత్రమే కాదని, కాలాతీత సాంపద్రాయ వారసత్వమని, అక్కడి ప్రజల స్ఫూర్తికి నిత్య పరీక్ష అని ఆయన తెలిపారు.
మరింత అభివృద్ధిగా చేయడం, మెరుగైన ఆరోగ్య రక్షణ కోసం అవకాశాలు కల్పించడం, వేగవంతమైన ఇంటర్‌నెట్ సౌకర్యం,ద్వారా లక్షద్వీప్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు అదే సమయంలో వారి స్థానిక సంస్కృతిని పరిక్షించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్షమని ప్రధాని తెలిపారు. లక్షద్వీప్‌లో రూ. 1,150 కోట్లతో తాను ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని మోడీ వివరించారు.