- Advertisement -
న్యూఢిల్లీ : తుర్ దాల్ (పప్పు) కొనుగోలు పోర్టల్‌ను కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. దీని ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకుని, తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరకు నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌కు విక్రయించవచ్చు. ఉరద్, మసూర్ దాల్, అలాగే మొక్కజొన్న రైతులకు భవిష్యత్‌లో ఇలాంటి కేంద్రమే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పోర్టల్ ద్వారా పప్పు విక్రయించినందుకు 25 మంది రైతులకు డిబిటి (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా దాదాపు రూ.68 లక్షలను మంత్రి చెల్లించారు. బఫర్ స్టాక్ నిర్వహణ కోసం ప్రభుత్వం తరఫున పప్పు ధాన్యాల సేకరణ కింద నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కొఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కొఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సహకారం అందిస్తాయి.
- Advertisement -