Saturday, November 23, 2024

జింఖానా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : టిఎన్‌జిఓస్ హైదరాబాద్ జిల్లా 9వ వార్షిక క్రీడోత్సవాలను ఆ సంఘం అధ్యక్షుడు డా.యస్.ఏం.హుస్సేని (ముజీబ్) నాయకత్వంలో జరిగాయి. యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ టిఎన్‌జీఓస్ యూనియన్‌కు 77 ఏళ్లు నిండాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. ఈ క్రీడల నిర్వహించిన డాక్టర్.ముజీబ్ తదితరులకు అభినందనలు తెలిపారు.

అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ టిఎన్‌జీఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా గత 8 సంవత్సరాల నుండి క్రీడలు నిర్వహించి క్రీడాకారులను ప్రొత్సహిస్తోందన్నారు. వీటిని రానున్న సంవత్సరాలలో కొనసాగించాలని ఈ సందర్భంగా ఆ సంఘానికి సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ ఈ క్రీడలకు విచ్చేసిన ముఖ్య అతిధులకు, పాల్గొన్న ఉద్యోగులకు అనుమతి ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి డిపిఆర్‌ఓ భానుప్రసాద్, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారి ఎన్. సుధాకర్ రావు, రామా రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫహీమ్ ఖురేషీ , టిఎన్‌జిఓస్ సెంట్రల్ యూనియన్ నాయకులు సీమా ముజీబ్, జానకి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. కాగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో గురువారం నుండి ఈ నెల 9వ తేదీ వరకు వరకు జరిగే నాకౌట్ మ్యాచ్‌లలో మొత్తం (26) జట్లు పాల్గొంటున్నాయి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఈ నెల పది నుండి 11 వరకు హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు కె.ఆర్.రాజ్‌కుమార్, జిల్లా కార్యదర్శి ఎస్. విక్రమ్‌కుమార్, కోశాధికారి జె.బాల్‌రాజ్, ఉపాధ్యక్షులు ఒమర్‌ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, ఎం.ఎ.ముజీబ్, ఇ.నరేశ కుమార్, సుజాత, హాలిద్ అహ్మద్, వైదిక్ శాస్త్ర, బోలిగిద్ద శంకర్, ఖాలీద్ అహ్మద్, శ్రీధర్, ముకిమ్ ఖురేషి, అసదుద్దీన్ హుస్సేని, మహమ్మద్ వహీద్ ముస్తఫా షరీఫ్ వివిధ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News