- Advertisement -
హైదరాబాద్: నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ టప్పిర్ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్, బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో మంటల్లో చిక్కుకుని కుమారుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
మరణించినవారిని కుత్భుల్లాపూర్ కు చెందిన తండ్రీ కుమార్(40), కుమారుడు ప్రదీప్(8)లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పరారైన టిప్పర్ డ్రవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -