Thursday, December 19, 2024

జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: హైదరాబాద్- నాగ్ పూర్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు అగిపోయాయి. కక్షపూరితంగా యువతిని కారుతో ఢీకొట్టి చంపేశారని రహదారిపై ఆందోళనకు దిగారు. కావాలనే కారుతో ఢీకొట్టి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల నిరసనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యువతి మృతికి కారణమైన నరేందర్ ను శిక్షించాలని కుటుంబీకులు నిరసన చేస్తున్నారు. ప్రమాదంలో నిన్న రాత్రి యువతి రమ్య మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News