- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మంచి స్పందన వస్తోంది, మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. ఆరు గ్యారెంటీల అమలుపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రమాణస్వీకారం చేసి మరునాటి నుంచే గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు, కెటిఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లిద్దరూ ఏమైనా బస్సుల్లో తిరుగుతారా..? ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే హరీశ్, కెటిఆర్‌ను ఓ ఆట ఆడుకునేవాడిని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -