Sunday, December 22, 2024

దావూద్ సొంత ఊరిలో ఆస్తుల వేలం

- Advertisement -
- Advertisement -

ముంబై : అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తులకు వేలం పాట జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ వేలం ఆరంభ ధర రూ 15,440. కాగా వేలంలో రూ 2 కోట్లకు ఇవి అమ్ముడయ్యాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్ ఇబ్రహీం కస్కర్ పుట్టి పెరిగిన ముంబ్కే గ్రామం ఉంది. ఇప్పుడు ఇక్కడి వ్యవసాయ భూముల వేలం నిర్వహించినట్లు దీనిని నిర్వహించిన స్మగ్లర్సు అండ్ విదేశీ మారకద్రవ్య అక్రమాల జప్తు అధీకృత సంస్థ (సఫెమా) తమ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే ఈ ఫరారీ నేరస్తుడికి చెందిన ముంబై ఇతర చోట్ల ఉన్న విలువైన ప్రాపర్టీలను సంబంధిత సంస్థ నిర్విఘ్నంగా నిర్వర్తించింది. ఇప్పుడు ఆయన స్వగ్రామంలో పూర్వీకుల ఆస్తుల వేలం పాటలో వీటిని ఎవరు దక్కించుకున్నది? వెంటనే వెలుగులోకి రాలేదు. అయితే దావూద్ ఆస్తులను వేలంలలో దక్కించుకుని అక్కడ సనాతన ధర్మ ప్రభోధ కేంద్రాలను స్థాపిస్తానని చెపుతూ వస్తోన్న సీనియర్ లాయర్ ఒకరు వీటిని కూడా దక్కించుకున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News