Sunday, January 19, 2025

ప్రభుత్వం డబ్ల్యూటిఐసిటిసికి సముచిత ప్రాధ్యానత

- Advertisement -
- Advertisement -

చైర్మన్ సందీప్ మఖ్తల సూచనలు స్వీకరిస్తాం: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎజెండాతో ముందుకు సాగుతున్న తమ పాలనలో ప్రపంచ తెలుగు ఇన్పర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్‌లకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టీ హబ్ వేదికగా శుక్రవారం జరిగిన అరైవల్ సమిట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంతో పాటుగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్దిలో తనవంతు పాత్ర పోషించిన సందీప్ ముఖ్తలను అబినందిస్తూ ఆయన సూచనలను నూతన ప్రభుత్వంలోనూ స్వీకరిస్తామని వెల్లడించారు. దేశంలో హైదరాబాద్ నంబర్ వన్ స్దాయికి ఎదిగేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రతి ఏడాది ఆరంభంలోని మొదటి శుక్రవారం అరైవల్ సమిట్ పేరుతో డబ్ల్యూటిఐసిటిసి, టీటా సంయుక్తంగా నిర్వహిస్తోంది. టీటా తో ఎప్పటి నుంచి అనుబంధం ఉందని, టీటా నిర్వహించిన బోనాల జాతరలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. తన స్వగ్రామమైన ధన్వాడను వంద శాతం డిజిటల్ గ్రామంగా టీటా తీర్చిదిద్దిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్ది వరకు సందీప్ మఖ్తల కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. దాదాపు 14 ఏళ్ల పాటు ఒక సంస్ధను క్రమబద్దంగా నడిపించడం, 42 దేశాలకు విస్తరించడం గొప్ప చర్యని అభినందించారు. సందీప్ కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ తమ ప్రభుత్వంలో ఐటీ పాలసీ రూప కల్పనలో డబ్లూటిఐటిసిని తప్పకుండా భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.

బెంగుళూరు, హైదరాబాద్ నగరాలను కంట్రీ కజిన్స్ అని కర్నాటక ఐటీ మంత్రి ప్రశంసించడం సంతోషకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమ వృద్ది కొనసాగిస్తామని, దేశంలో అగ్రగామిగా రూపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం సందీప్ మఖ్తల ప్రసంగిస్తూ తమ సంస్ద కార్యాచరణను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తించడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో తమను భాగస్వామ్యం చేయడంతో ఆనందంగా ఉందని, ఉద్యమంలో పాల్గొనడం, తదుపరి ప్రభుత్వానికి సహకరించిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వానికి సైతం మద్దతు కొనసాగిస్తామన్నారు.

ఈకార్యక్రమంలో టీహబ్ సీఈఓ శ్రీనివాస్ మహంకాళి, శ్రీనివాస్ తాలుక, వింగ్ కమాండర్ అనీష్, ఈవీ శ్రీనివాస్, సతీష్, నెల్లి ప్రసన్న, మహేష్ కొనగాలు, ఇలియాస్, శ్రీజ, ఆకుల, నిత్య, ఈశ్వర్ కొత్త, అమెరికాకు చెందిన ఎస్‌బిఎస్ కార్ప్ కళ్యాణ్ చివకుల, వివిధ ఐటీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News