Friday, December 20, 2024

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో భూవివాదాలకు సంబంధించి అంశాలే ఎక్కువగా కనిపించాయి. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు, బాధితులు శుక్రవారం తరలి వచ్చారు. అయితే ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. కానీ భూకబ్జాలపై ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అందులోనూ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే భూ కబ్జాలకు పాల్పడినట్లు ఫిర్యాదులతో ప్రజావాణికి బాధిత ప్రజానీకం క్యూకడుతూ అందుకు సంబంధించిన తమ అర్జీలను అధికారులకు సమర్పిస్తున్నారు.

అటు 317 జీవో కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ప్రజావాణిలో అధికారులకు మొర పెట్టుకున్నారు. మొత్తంగా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఎఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్యకి ప్రజావాణి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News