Friday, December 20, 2024

72,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం చివరి రోజు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అయితే భారీ ఒడిదుడుకులను చూసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72,000 మార్క్ దాటింది. ఆఖరికి 178 పాయింట్ల జంప్‌తో 72026 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 21,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఐటి షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఇది కాకుండా ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు గ్రీన్‌లో ముగిశాయి.

అదే సమయంలో బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు క్షీణతతో ముగిశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో ముగియగా, 12 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ బూమ్ కారణంగా బిఎస్‌ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలో పెరిగింది. బిఎస్‌ఇ డేటా ప్రకారం, గురువారం లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.368.43 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం ఇది రూ.369.23 లక్షల కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News