Sunday, December 22, 2024

రాజస్థాన్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌ లో రైలు ప్రమాదం జరిగింది. కోట జంక్షన్ సమీపంలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. భోపాల్ కు వెళ్తుండంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, రైల్వే అధికారులు వెంటనే సంఘటనాస్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని.. బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు.  కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.ప్రమాద ఘటన వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News