- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -