గతవారం సెన్సెక్స్ 180 పాయింట్లు అప్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకుని లాభాల జోరును చూపించాయి. గతవారం బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 180 పాయింట్ల వరకు లాభపడింది. సెన్సెక్స్ సూచీ మళ్లీ 72,000 పాయింట్ల మార్కును దాటింది. ఇక నిఫ్టీ 21,700 పాయింట్ల మార్క్‌ను దాటింది. వారం చివరి రోజు శుక్రవారం మార్కెట్ భారీ ఒడిదుడుకులను చూసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్ల జంప్‌తో 72026 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 21,170 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఐటి షేర్లలో అత్యధికంగా లాభపడ్డాయి. ఇక ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు నష్టపోయాయి. బిఎస్‌ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన గురువారం లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.368.43 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం ఇది రూ.369.23 లక్షల కోట్లకు చేరుకుంది. భారత్ జిడిపి వృద్ధి రేటుపై ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని చూపింది. ప్రభుత్వం 202324 జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) అంచనాను 7.3 శాతానికి పెంచింది. అంతకుముందు 202223లో ఇది 7.2 శాతంగా ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు జాతీయ ఆదాయం అంచనాలను శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ(ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసింది. 2023-24లో భారతదేశ జిడిపి రూ.296.58 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. జాతీయ ఆదాయం మొదటి ముందస్తు అంచనాలో 2011-12 స్థిరమైన ధరల ప్రకారం, వాస్తవ జిడిపి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 171.79 లక్షల కోట్లకు చేరుకోనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 160.06 లక్షల కోట్ల జిడిపి తాత్కాలిక అంచనా 2023 మే 31న విడుదల చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం జిడిపి రూ. 296.58 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2023 మే 31న విడుదల చేసిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక అంచనాల ప్రకారం, జిడిపి రూ. 272.41 లక్షల కోట్లు ఉంది. ఈ గణాంకాలు మార్కెట్‌కు సానుకూల సంకేతాలు ఇవ్వనున్నాయి.