Monday, December 23, 2024

ఈనెల 10వ తేదీ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07065), సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (07066), నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్(07251), 11వ తేదీన కాకినాడటౌన్ నుంచి సికింద్రాబాద్ (07067), సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ (07252), 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (07250), 13న కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును (07249) నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 16వ తేదీన కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ (07253), 17న సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07254) నడుపనున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News