Friday, November 22, 2024

తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలి

- Advertisement -
- Advertisement -

పిఆర్‌టియుటిఎస్ డైరీ ఆవిష్కరణలో సి.ఎం. రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శనివారం పిఆర్‌టియుటిఎస్ నూతన సంవత్సర డైరీని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

డిసెంబర్ నెల వేతనాలను ఇచ్చినమాట ప్రకారం 5వ తేదీలోగా చెల్లించినందుకు ఎంఎల్‌సి రఘోత్తం రెడ్డి, పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ఉపాధ్యాయ పదోన్నతులతోపాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని ఎంఎల్‌సి ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నాయుకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News