చెన్నై: తమిళనాడులోని పుదుకోటైలో శనివారం జల్లికట్టు సందర్భంగా 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పొంగల్ పండుగ(సంక్రాంతి) సందర్భంగా తమిళనాడులో ఎద్దులను పట్టుకునే క్రీడగా జల్లికట్టును వ్యవహరిస్తారు. జల్లికట్టును నిషేధించాలని జంతు హక్కుల సంస్థ పేటతోసహా అనేక పిటిషన్లు దాఖలు కాగా గత ఏడాది మే నెలలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టును సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
ఈ ఏడాది పుదుకోటై జిల్లాలో జల్లికట్టు పోటీఉలు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది యువకులు ఈ ఆటలో పాల్గొంటున్నారు. మైదానంలోకి ఎద్దులను వరుసగా వదిలిపెడతారు..వీటిని పట్టుకుని తమ అదుపులోకి తీసుకోవడానికి యువకులు ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా ఎద్దులు పొడవడం, వాటి కాళ్ల కింద నలగడం, కింద పడిపోవడం వంటి కారణాలతో అనేక మంది గాయపడుతుంటారు.