Saturday, November 23, 2024

మేడిగడ్డ బ్యారేజి పనికి రాదు: జస్టిస్ చంద్ర కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరినదిపై నిర్మించిన మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజిలు పనికి రావని జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం పాశం యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన కాళేశ్వరం రీడిజైన్స్ తప్పిదాలు పరిష్కార మార్గాలు అన్న అంశంపై సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో ఇంజనీర్స్‌పోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జస్టిష్ చంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టుల డిజైన్స్ బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తప్పులు చేశారని ఆరోపించారు. ఆయనే మళ్లీ మేడిగడ్డపై మంత్రుల బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని తప్పులు చేసిన వ్యక్తి వాస్తవాలు ఎలా వివరిస్తారన్నారు. వాస్తవాలు దాచి మసిబూసి మారేడు కాయ చేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను ఓడించి కేసిఆర్‌ను గద్దెదించేందుకు అందరం కష్టపడ్డామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి పాలనలో మంచి పేరు రావాలన్నారు. అధికారులు తప్పుదోవ పట్టిస్తారని అటువంటి వారిని దూరం పెట్టాలన్నారు.హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించారని, అటువంటి నిజాయితీ సమర్ధత గల అధికారులను నియమించుకోవాలని సూచించారు. శత్రుశిబిరంలో పనిచేసిన వారిని సలహాదారులుగా పెట్టుకోవద్దని సూచించారు. పాశం యాదగిరి మాట్లాడుతూ నీటిపారుల శాఖ ఈఎన్సీ మురళీధర్ అవినీతికి మూలపురుషుడు అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లో ఆయనే భాద్యుడన్నారు. మేడిగడ్డలో భాధ్యత ఈఎన్సీదే అన్నారు. వాస్తవాలు దాచి నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన చూస్తే ముఖాలే మారాయి తప్ప బిఆర్‌ఎస్ ప్రభుత్వమే నడుస్తుందన్న అభిప్రాయం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News