Friday, December 20, 2024

ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జబర్దస్త్ షోతో ముక్కు అవినాష్ వెలుగులోకి వచ్చాడు. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ సినిమాలు చేయడంతో పాటు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. 2021లో అనూజ అనే అమ్మాయిని అవినాష్ పెళ్లి చేసుకున్నాడు. 2022 ఏప్రిల్ లో తన భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు మాత్రం బిడ్డను కోల్పోయానని తన బాధను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికి బాధను దిగమింగుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో సంతోషం, బాధ, అయినా మీతోనే పంచుకుంటానని అవినాష్ వివరణ ఇచ్చాడు. తన జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని, కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయానని, ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడించారు. ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని కోరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News