Monday, December 23, 2024

యువతిని వేధించిన యువకుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమపేరుతో యువతిని వేధించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్‌నగర్‌కు చెందిన హరీష్ అనే యువకుడికి(22), ఈస్ట్‌మారేడుపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి మెలిసి తిరిగారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. యువతిని హరీష్ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇద్దరు చనువుగా ఉన్న వీడియోలు, ఫొటోలు పెట్టి వేధిస్తుండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News