- Advertisement -
బెంగళూరు: కట్నం రూపంలో 15 లక్షల రూపాయలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పిన నవ వరుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన కర్నాటకలోని బసవనగుడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2022 జూన్ 6న ఇంజినీరు అవినాశ్ అనే యువకుడితో యువతికి వివాహం జరిగింది. పెళ్లి జరినప్పుడు కట్నం కానుకలు వద్దని చెప్పాడు. ఇప్పుడు 15 లక్షల రూపాయలు కట్నం ఇస్తేనే శోభనం గదిలోకి వస్తానని డిమాండ్ చేశాడు. అల్లుడి వేధింపులు తట్టుకోలేక రూ.5.8 లక్షలు ఇచ్చారు. మిగిలిన నగదు ఇస్తేనే శోభనం జరుగుతుందని, లేకపోతే జరగదని హింసించాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -