Saturday, January 18, 2025

పేకాట రాయుళ్ల దగ్గర లంచం అడిగిన ఎస్‌ఐపై వేటు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: పేకాట ఆడుతూ పోలీసులకు దొరికారు. 70 వేల రూపాయలు ఇస్తే ఆరుగురిని ఈ కేసు నుంచి తప్పిస్తానన్న ఎస్‌ఐపై వేటు పడిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొప్పల్లి గ్రామ శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఎస్‌ఐ వసూరామ్ నాయక్ మరో కానిస్టేబుల్ బాధితుల నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చుకోలేక బాధితులు జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి సదరు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News